రంగానాయక్ సాగర్‌కు నీటి విడుదల
రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ .. ఇవాళ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజని’ అన్నారు. ఈ రోజు కోసమే తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారు. ఈ రోజు ఆకల నిజమయ్యిందన్నారు. కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయి అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సిఎం కెసిఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కాగా ఈకార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/