డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్

Minister Harish rao
Minister Harish rao

మెదక్‌: మంత్రి హరీష్‌రావు మెదక్‌ జిల్లాలోని శివ్వంపేట దంతాన్‌పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దంతాన్‌పల్లిలో ఉన్న దేవాదాయ భూములు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కలెక్ట‌ర్‌ను ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు పీఎంజీ రోడ్లకు రూ.112 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో రూ.13 కోట్లు, రెండో విడతలో రూ.10 కోట్లు మంజూరు అవుతాయని అన్నారు. మండలంలోని డంపు యార్డ్ స్మశాన వాటికలను 15 రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచులను, కార్యదర్శులను ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/