ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి హరీశ్‌ రావు

minister-harish-rao-inaugurates-double-bedroom-houses-in-siddipet

సిద్దిపేటః మంత్రి హరీశ్‌ సిద్దిపేట జిల్లాలోని పాలమాకులలో కొత్తగా నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే సొంతజాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్‌మెంటుకు కూడా సరిపోయేవి కాదని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి తాళం చేతిలో పెట్టి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఉందా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దంటున్న కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలు ఆదాయం పెంచుతున్నారని, బిజెపి మాత్రం ప్రజల సొమ్మును ధనవంతులకు పంచుతున్నదని దుయ్యబట్టారు. త్వరలో అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని, సిఎం కెసిఆర్‌ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని వివరించారు. కానీ ఢిల్లీ బీజేపీ ఉచితాలు వద్దని, కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్ వద్దని స్వయంగా దేశ ప్రధాని చెప్తుంటే ప్రజలేమవాలనీ నిలదీశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/