వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానివి అనాలోచిత నిర్ణయాలు

అమ్మ పెట్టదు… అడుక్కోనివ్వదు అన్నట్లుగా కేంద్రం తీరు: హరీష్‌రావు

సిద్ధిపేట: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో 11రకాల స్పైడర్లకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని…. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు.

తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లను కూడా కేంద్రం కొనుక్కోనివ్వడం లేదని అన్నారు. సకాలంలో వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయిందని హరీశ్ విమర్శించారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న కేంద్రం… రాష్ట్రాలపై తన తప్పులను తోసేస్తోందని అన్నారు. తప్పుడు నిర్ణయాలపై కేంద్రం పునరాలోచించాలని సూచించారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/