టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ కాలేజీలు వచ్చేవా? : మంత్రి హరీష్

మహబూబాద్ : మంత్రి హరీశ్‌ రావు జిల్లా పర్యటనలో భాగంగా మహబూబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నం. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్ అని, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజులు మంజూరు చేస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ కాలేజీలు వచ్చేవా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి నాలుగుఓట్లు సంపాందించే ప్రయత్నం చేస్తారని, ఆపార్టీను నమ్మవద్దు అని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాకముందు 3 మెడికల్ కాలేజిలు మాత్రమే వచ్చాయన్నారు. నిజామాబాద్,ఆదిలాబాద్, వరంగల్ లో మాత్రమే వచ్చాయని తెలిపారు. ఏడేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెడుతున్న ఘనత సీఎంకేసీఆర్ అని కొనియాడారు. పేదలు నాణ్యమైన వైద్యం పొందాలని సీఎం కేసీఆర్ కోరిక అని అన్నారు. పేదవిద్యార్థులు మెడికల్ చదువుల చదవాలని ఈ ప్రక్రియ ప్రారంభించారన్నారు. సర్కారు దవాఖానాల్లో కార్పోరేట్ వైద్యం అందాలన్నారు. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/