ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌

సిద్దిపేట : మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని అన్నారు. జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.

జిల్లాలో వానాకాలం ధాన్యం పంట కొనుగోలుకు 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాలలో వరి సాగు 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 6 మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాంలు ఉండగా..రాష్ట్రం ఏర్పడ్డాక 35లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం లను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. ఎంత పంట వచ్చిన కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/