నెల్లూరుకు మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం

ప్రత్యేక చాపర్ లో తరలింపు

Hyderabad: హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి దివంగత ఏపీ మంత్రి గౌతంరెడ్డి భౌతిక దేహం చేరుకుంది. అంబులెన్స్ వెంటే వచ్చిన టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. చాపర్ లో మంత్రి పార్థివదేహం వెంటే సతీమణి శ్రీకీర్తి, తల్లి మణిమంజరి ఉన్నారు. చాపర్ లోకి మంత్రి మేకపాటి పార్థివదేహాన్ని ప్రభుత్వ సిబ్బంది చేర్చింది. ఉదయం 7గంటలకే బేగంపేట విమానాశ్రయం నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వైసిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి సోదరులు, కుటుంబ సభ్యులు నెల్లూరు కు బయలుదేరారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/