కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా

తనతో కాంటాక్ట్ లోకి వచ్చినవారు జాగ్రత్తగా ఉండాలని సూచన

Gajendra Singh Shekhawat

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనలో కొన్ని లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని… పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్ లో చేరబోతున్నానని… తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని, ఐసొలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. మరోవైపు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రికి కరోనా రావడంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/