కరోనాపై ప్రభుత్వం పకడ్బందీ చర్యలు
వైద్య సిబ్బందితో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్‌లు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులకు తగు సూచనలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా త్వరగా కరోనా పరీక్షలు నిర్ధారణ చేద్దామని, మరణాలను అరికడదామని మంత్రి తెలిపారు. డైట్ కాంట్రాక్టర్స్ బకాయిలు అన్నీ చెల్లిస్తామని.. ఐసోలేషన్ సెంటర్స్‌ను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే శానిటైజేషన్, పేషంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని అనుమతి తీసుకొని నియమించుకోవాలని సూచించారు. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్‌లను ఇక్కడి నుంచే పంపిస్తామని మంత్రి తెలిపారు. ఈక్రమంలోనే మంత్రి కరోనా కట్టడి కోసం పలు సూచనలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/