టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

జనగామ: టిఆర్‌ఎస్‌ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే జ‌న‌గామ టిఆర్‌ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని శ‌నివారం ఉద‌యం రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి క‌లిసి సంద‌ర్శించారు. నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించి.. కాంట్రాక్ట‌ర్‌కు త‌గు సూచ‌న‌లు చేశారు. ఈ కార్యాల‌యం ప్రారంభానికి సిద్ధంగా ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే సిఎం కెసిఆర్‌ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ చేతుల మీదుగా కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో నిర్మిస్తున్న ఐదు కార్యాల‌యాలు త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్య‌క‌లాపాల‌న్నీ అందులోనే జ‌రుపుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా అనుకూలంగా ఉంటుంద‌న్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/