వాల్మీకీ మహర్షికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : వాల్మీకీ మహర్షి జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నివాళులర్పించారు. ఒక సామాన్యుడైన బోయ‌వాడు అంత గొప్ప క‌వి కావ‌డం మ‌న దేశ సంస్కృతి గొప్పద‌నమని చెప్పారు. వాల్మీకీ రాసిన రామాయ‌ణం భార‌త ప్రజ‌ల పారాయ‌ణంగా మారింది. మనిషి బతికున్నంతవరకు అది ఉంటుందని చెప్పారు. వాల్మీకీ ద‌క్షిణ భార‌త దేశ‌మంతా తిరుగుతూ గోదావ‌రి న‌దీ తీరాన కొంత కాలం ఉన్నాడని, అలా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ల్మీడిగా (వాల్మీకీపురం) మారిన గుట్టల్లో కొంత కాలం త‌పస్సు చేశాడ‌ని చెబుతారని వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పండుగలన్నిటినీ ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని, గొప్ప కవులు, కళాకారులు, చారిత్రక పురుషుల జయంతి, వర్ధంతులు కూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. వాల్మీకీ జయంతిని కూడా సర్కారే నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఇలా ఒక్క తెలంగాణ‌లో త‌ప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/