ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

errabelli dayakar rao
errabelli dayakar rao

జనగామ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్‌ ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. .రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది.110 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. నిర్మాల, కొడకండ్లలో కొత్తగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందొద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ప్రపంచంలో రైతు వేదికలు ఎక్క డా లేవన్నారు. మొట్ట మొదటగా సీఎం కేసీఆర్ ఆలోచనలతో మన రాష్ట్రంలోనే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/