తెలంగాణ ప్రజల గుండెల్లో టిఆర్‌ఎస్‌ నిలిచింది

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

వరంగల్‌: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున రాయపర్తి, మైలారం గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధిసాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్‌ఎస్ నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బేజారైంది. చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీకి జలకళ వచ్చింది. గ్రామాల్లో సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారు. అని దయాకర్‌రావు అన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/