పదవుల ఫై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

botsa satyanarayana
botsa satyanarayana

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని అన్నారు. ఈరోజు బుధువారం పార్వతీపురం లో వైస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరుగగా..ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలను మరింత అభివృద్ధి చేస్తామని , పార్టీని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులకు,జిల్లా మంత్రులకు ఉంది అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో రాజకీయం అవసరమని అన్నారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అధికారులు నిర్వహించాలని కోరారు. రెండోసారి అధికారంలోకి రావడం కోసం మొదటి సారి ఎన్నికైన ప్రతినాయకుడు కష్టపడాలి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడం- దాచుకోవడం తప్ప చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు లేవన్నారు. పార్టీ కోసం కష్ట పడిన వారికి అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.. వారికే పార్టీ పదవులు అన్నారు.