శ్రీశైలం ప్రాజెక్టుకు ఎటువంటి ముప్పు లేదు

anil kumar yadav
anil kumar yadav

అమరావతి: శ్రీశైలం డ్యామ్‌పై వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. డ్యామ్‌లో పగుళ్లు వచ్చాయని..ఏపీకి ముప్పు ఉందని చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. శ్రీశైలం డ్యామ్‌ సేఫ్టీపై ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యామ్‌కు ఎటువంటి ముప్పు లేదని, శ్రీశైలం డ్యామ్‌ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులపై నిర్లక్యం అంటూ వస్తున్న వార్తలు సత్యదూరమన్నారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి కోరారు. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి పగుళ్లు లేవని ప్రాజెక్టు నిర్వహణను ప్రత్యేక శ్రద్ధతో చేపడుతున్నామని ఇరిగేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదని..నిపుణులు డ్యామ్‌ను పరిశీలించారంటున్నారు డ్యామ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు. డ్యామ్‌ ప్లంజ్‌ పూల్‌ ప్రమాదకరం కాదని..గోవా, విశాఖ నిపుణులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/