ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను

తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటనే నడుస్తాను..మంత్రి అనిల్ కుమార్

anil-kumar-yadav
anil-kumar-yadav

అమరావతి: బుధవారం జిల్లాలో జరిగిన బీసీల సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ..ఏపిలో చంద్రబాబు పని అయిపోయిందని, హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని హితవు పలికారు. ఆయన కుమారుడు ఈ మధ్య ట్రాక్టర్ స్టీరింగ్ వదిలేసి ప్రజలపైకి పోనివ్వబోయారని…. ఆ పార్టీ పరిస్థితి అంతే అని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకి పెద్దపీట వేసింది వైఎస్‌ఆర్‌సిపినే అని మంత్రి తెలిపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటనే నడుస్తానని, ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/