సూపర్ సిక్స్ పథకాలు అమలుఫై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. బాబు అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకంతో భారీగా ఓట్లు వేసి గెలిపించారు. ఇక అధికారంలోకి వచ్చిన బాబు..సీఎం గా బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం మొదలుపెట్టారు. ఇప్పటికే పెన్షన్ దారులకు ఇస్తాన్నట్లే పెంచిన పెన్షన్ ఇచ్చారు..ఫ్రీ గా ఇసుక మొదలుపెట్టారు. త్వరలోనే మిగతా హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సూపర్ సిక్స్ పథకాలపై కీలక ప్రకటన చేసారు.

ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 1500, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు, ప్రతి స్కూలుకు వెళ్లే విద్యార్థికి రూ. 15 వేలు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు వంటి సూపర్ సిక్స్ హామీలు హామీలు ఇచ్చింది. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. అలాగే మండల స్థాయిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. రైతుల పాస్‌బుక్‌లపై జగన్ ఫొటోను తీసి వేసి ప్రభుత్వ ముద్ర వేస్తామన్నారు. ఇప్పటికే ల్యాండ్‌టైటిల్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు.