బాబూ నిత్య కల్యాణ్‌..నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ అమ‌ర్నాథ్ ట్వీట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి పలు ట్వీట్స్ చేసారు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మొదటి నుండి పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు , ఎద్దేవాలు , కామెంట్స్ చేస్తూ అభిమానుల్లో , కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా తన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచారు. బాబూ నిత్య కల్యాణ్‌… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పలు ట్వీట్స్ చేసారు.

  • ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్
  • బీజేపీతో వివాహం… చంద్రబాబుతో సంసారం…
  • హిందీ అమ్మాయితో పెళ్ళి… రష్యన్‌తో పిల్లలు…
  • అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలు చదివే గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టటానికి వీల్లేదని… అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదించిన బాబు బ్యాచ్‌ది క్లాస్‌ వార్‌ కదా?
  • బాబూ నిత్య కల్యాణ్‌… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అంటూ అమ‌ర్నాథ్ ట్వీట్ చేశారు.