సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల

బాసర: వసంత పంచమి వేడుకలు బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. బాసర ఆలయన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తుందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. మంత్రి అల్లోల తో పాటు ముదోల్ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/