ప్రజలు కాలుష్యబారిన పడకుండా హరితహారం

నిర్మల్‌ జిల్లాకేంద్రం శివారులోని గండి రామన్న ఆక్సిజన్‌ పార్కులో మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజలు కాలుష్యబారిన పడకుండా హరితహారం
Minister Allola Indrakaran Reddy

హైదరాబాద్‌: రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్మల్‌ జిల్లాకేంద్రం శివారులోని గండి రామన్న ఆక్సిజన్‌ పార్కులో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించేందుకే ప్రభుత్వం హరితాహారం కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాలుష్యబారిన పడకుండా హరితహారాన్ని చేపట్టామని వివరించారు. ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందేలా సిఎం కెసిఆర్ అటవీశాఖ ద్వారా 60 అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గండిరామన్న పార్కును 600 ఎకరాల్లో విస్తరించి మరింత అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/