మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు మొదలు

Mini tribal festival to be held in Medaram in February

ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరగబోతుంది. ఈ మేరకు పనులు మొదలుపెట్టబోతున్నారు. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర(మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న మండమెలిగే 2 న సారలమ్మ గద్దె శుద్ధి, 2 న సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. శుద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తారు.

ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్యలు, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మినీ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేస్తుంది.