‘కరోనా’పై కొరడా

ఎపిలో ‘మినీ హెల్త్‌ ఎమర్జెన్సీ’
వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గట్టి చర్యలు
కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ చట్టం అమలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు మినిహెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది.

దీనికి ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కోవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020గా నామకరణం చేసారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

వైద్యఆరోగ్య శాఖ, ఇతర కీలక ప్రభుత్వ శాఖల అధికారులు విస్తృతంగా చర్చలు జరిపిన తురువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా వ్యాధిని నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తి స్ధాయిలో చర్యలు చేపట్టింది.

ఎక్కడిక్కడ అనుమానితులను పరీక్షించి,వారికి తగిన వైద్యసేవలను అందించేందకు చర్యలు చేపట్టింది.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌ లకు అందుబాటులో వున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహయక చర్యలు చేపట్టింది.

దాదాపు ఎనిమిది ఐసోలేషన్‌ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది.

అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ గదుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/