మినరల్‌ వాటర్‌

ఆరోగ్యం-జాగ్రత్తలు

Mineral Water
Mineral Water

శీతాకాలం, వర్షాకాలం ప్రారంభం కావవడంతో, జ్వరం, జలుబు, తలనొప్పి, అనారోగ్యాలు, ఉబ్బసం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ సందర్భాలలో దాహం ఎక్కువ ఉంటుంది. ఎంత శుభ్రమైన నీరు తాగినా సంతృప్తిగా అనిపించదు.

ఆ సమయంలో మన నాలుకకు వేడినీటిని తాగడం తప్ప వేరే మార్గం ఉండదు. చలికాలం, వర్షాకాలంలో మంచినీరు ఎంత తాగినా గొంతులో పొడిగానే ఉంటుంది. మినరల్‌ వాటర్‌లో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, మినరల్‌ లవణాలు, శుద్ధిచేసిన లవణాలతో కలిపి మినరల్‌ వాటర్‌ ఉంటుంది.

Mineral Water
Mineral Water

అయితే మామూలు మంచినీటిలా మినరల్‌ వాటరల్‌ను కూడా వేడిచేసి తాగాలా అన్న సందేహం కలుగుతుంది.

అయితే మినరల్‌ వాటిల్‌ను వేడిచేస్తే దానిలోని అన్ని పోషకాలు పోతాయి అంటుంటారు. సాధారణంగా మనం బయట నీరు కొని తాగుతుంటాం.

కొన్ని నిర్దిష్ట బ్రాండ్లు మేహా కొందరు సొంత ఇళ్లలోనే ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. శుద్ధి చేసిన నీటిలో అధిక భాస్వరం లాంటి లవణాలు శుద్ధీకరణ సమయంలో విడుదలవుతాయి.

అది కాకుండా ఇతర పోషకాలు విడుదల చేయబడవు.

భాస్వరం లేకపోతే మినరల్‌ వాటర్‌కు సాధారణ నీటికీ తేడానే ఉండదు. కాబట్టి మినరల్‌ వాటర్‌ను సాధారణ నీటి మాదిరిగానే వేడి చేయవచ్చు.

అందువల్ల పోషకాలు విడుదల చేయబడవు. సాధారణంగా మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి.

నీరు బాహ్య మాద్యమం లాంటిది. వేడి, గాలి దానిపై పడినప్పుడు అవి నీటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. నీటిలో గాలి, వేడి బ్యాక్టీరియా ఏర్పడటం ప్రారంభిస్తుంది. ఇది సాధాణ నీరు, శుద్ధిచేసిన నీరు, మినరల్‌ వాటర్‌కు వర్తిస్తుంది.

Mineral Water
Mineral Water

మినరల్‌ వాటర్‌ బాటిల్‌ తెరిచిన 24 గంటలో వాడటం మంచిది. లేకపోతే అందులో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే మినరల్‌ వాటర్‌ బాటిళ్లను తిరిగి వాడకూడదు.

సాధారణంగా నీటి శుద్ధీకరణ వ్యవస్థలో పాశ్చాత్య దేశాలకు మనదేశాలకు మధ్య చాలా తేడాలు ఉంటాయి.

ఎత్తైన ప్రదేశాలలో, స్వచ్ఛమైన జలపాతాల నుండి నీరు శుద్ధి చేయబడి అవసరమైన నిష్పత్తిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కలుపుతారు.

అది నిజంగా మినరల్‌ వాటర్‌. సేవదన మినరల్‌ వాటర్‌ తాగవద్దు. స్వేదనం అదనపు ఖనిజాలను పనికిరానిదిగా చేస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/