పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మజ్లిస్‌ కార్పొరేటర్ ..

హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులకు ఓ మజ్లిస్‌ కార్పొరేటర్ వార్నింగ్ ఇచ్చిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంగళవారం రాత్రి నాలుగు గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో హోటల్ ఓపెన్ ఓపెన్ చేసి ఉండడం తో హోటల్ మూసివేయాలని , హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్పడం తో..కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా పోలీసులతో గొడవకు దిగాడు. కనీస మర్యాద కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనేశాడు.

రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ..ఇక్కడకు కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ వచ్చాడని.. మీ ఎస్‌ఐ, సీఐకి చెప్పండి అంటూ సినిమా డైలాగ్స్ పేల్చాడు. రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు హెచ్చరించాడు. ఈ ఘటన పట్ల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అందరికీ ఒకే రూల్‌ అమలు చేయడం చేతకాకపోతే… మజ్లిస్‌ వాళ్లను మాకు అప్పగించండి.. వాళ్లకు అర్థమయ్యే భాషలో తాము చెప్తామంటూ కామెంట్ చేశారు. కార్పొరేటర్ ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేసాడు