చైనాను కట్టడి చేయాలంటే ఇండియాతో సైనిక బంధం

అమెరికా సెనేటర్‌ థామ్‌ టిలిస్‌ వ్యాఖ్య

US Senator Thom Tilis

చైనాను కట్టడి చేయాలంటే ఇండియాతో సైనికబంధం బలోపేతం చేయాలని అమెరికా సెనేటర్‌ థామ్‌ టిలిస్‌ అన్నారు.

అబద్దాలు, వెూసం, నిజాలను కప్పేయడం’ ద్వారా కరోనా విశ్వమహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆయన 18 సూత్రాల ప్రణాళికను అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అన్నీ దాచిపెట్టడం వల్ల కరోనా మహమ్మారి వ్యాపించిందని, అనేకమంది అమెరికన్లు కడగండ్ల పాలయ్యారని సెనేటర్‌ టిలిస్‌ పేర్కొన్నారు.

ఆ ప్రభుత్వమే తన సొంత పౌరులను నిర్బంధ శ్రామిక శిబిరాల్లో పెడుతున్నదని, అమెరికా టెక్నాలజీని, ఉద్యోగాలను దొంగిలిస్తున్నదని అన్నారు.  .

గురువారం తన ప్రణాళికను ఆవిష్కరించే సందర్భంలో ఆయన చైనాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా ముప్పు  తెస్తున్నదని మండిపడ్డారు.  చైనాపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు.

పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కట్టడికి చొరవ చేపట్టాలని తెలిపారు. అమెరికా సైన్యం కోరుతున్న 20 బిలియన్‌ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు) నిధులను మజూరు చేయాలని సెనేటర్‌ టిలిస్‌ సూచించారు.

ప్రాంతీయ మిత్రదేశాలతో సైనికబంధాన్ని బలోపేతం చేసుకోవాలని, ఇండియా, తైవాన్‌, వియత్నాంలకు సైనిక ఆయుధాలు సరఫరా చేయాలని ప్రతిపాదించారు. 

సాంకేతిక ఆధిపత్య సాధించేందుకు అమెరికా కంపెనీలకు రాయితీలు కల్పించాలని చెప్పారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/