కూలిన హెలికాప్టర్‌..ఇద్దరు పైలట్లు మృతి

Afghan Military Helicopter Crash
Afghan Military Helicopter Crash

అమరావతి: కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని పొర్చమాన్ జిల్లా వెస్ట్రన్ ఫర్హా ప్రొవెన్స్ లో గురువారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఆయుధాలు, మందగుండు సామాగ్రి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదాన్ని ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ధృవీకరించారు. ఇంజన్ సాంకేతిక లోపంలో ఎఎఎఫ్ ఎంఐ 35 హెలికాప్టర్ కూలిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాహుల్లా అహ్మద్ జాయి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/