ఉక్రెయిన్ కు సైనిక సాయం : జో బైడెన్‌

మున్ముందు మరింత సాయం చేస్తామ‌ని ప్రకటన

Military aid to Ukraine- Joe Biden
Military aid to Ukraine- Joe Biden

అంతర్జాతీయ న్యాయస్థానం (యూఎన్ ఎస్ సి) ఆదేశించి నప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. గడచిన 22రోజులుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తూనే ఉంది. దీంతో రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తదుపరి రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. అంతేకాదు , 800 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం ప్రకటించింది కూడ. మున్ముందు ఉక్రెయిన్ కు మరింత సాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/