ప్రతీఘాత శక్తులకు అమెరికానే బాధ్యత వహించాలి

Miguel Diaz-Canel
Miguel Diaz-Canel

క్యూబా:లాటిన్‌ అమెరికాలోని పలు దేశాలలో నయా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలతో కొనసాగుతున్న అశాంతి, రాజకీయ, సామాజిక ఆస్థిరతకు అమెరికాతో పాటు ఈ ప్రాంతంలోని ప్రతీఘాత శక్తులు బాధ్యత వహించాల్సి వుంటుందని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ సృష్టం చేశారు. అమెరికా బెదిరింపులు, ఆంక్షలకు తమ దేశం ఎన్నడూ తలొగ్గబోదని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఒక ట్వీట్‌లో తేల్చి చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు అమెరికా ఆంక్షలను ఖండిస్తూ క్యూబా విదేశాంగశాఖ విడుదల చేసిన ప్రకటనను ఆయన గట్టిగా సమర్థించారు. ప్రజలు విదేశీ దురాక్రమలణల నుండి క్యూబాను రక్షించుకోవటంతో పాటు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు సంఘీభావంగా నిలిచేలా వారిని సిద్దం చేయడమ క్యూబా బాధ్యత అని ఆయన తన ట్వీట్‌లో ఉద్ఘాటించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/