రైలులో జార్ఖండ్ కు వలస కూలీల తరలింపు

లింగంపల్లి నుండి వలస కూలీల తరలింపుకు ప్రత్యేక రైలు ఏర్పాటు

moving migrant workers to jharkhand in train
moving migrant workers to jharkhand by train

హైదరాబాద్; లాక్ డౌన్ కారణంగా తెలంగాణ లో చిక్కుకుపోయిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 1200 వలస కూలీలను నేడు ప్రత్యేక రైలులో జార్ఖండ్ కు తరలించారు. ఈ వలస కూలీలను హైద్రాబాద్ లోని లింగం పల్లి రైల్వే స్టేషన్ నుండి జార్ఖండ్ లోని హతియా కు తరలించారు. ఒక్కో భోగి లో 72 సీట్లు ఉన్నప్పటికీ ఒక్కొక్కరి మధ్య సామజిక దూరం ఉండేలా భోగికి 54 మంది చొప్పున మాత్రమే అనుమతిచ్చారు. కాగా వలస కార్మికులను రోడ్డు మార్గం ద్వారానే పంపించాలన్న కేంద్రం ఆలోచనను పలు రాష్ట్రాలు వ్యతిరేకించడం తో రైలు మార్గాల ద్వారా తరలించడానికి కేంద్రం అనుమతించింది. దీనితో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడంతో లింగం పల్లి నుంచి తోలి రైలు బయలు దేరింది. వీరంతా జార్ఖండ్ చేరుకున్నాక కరోనా పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/andhra-pradesh/