కరోనా పై చైనా అధికారి కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ ను వూహాన్ కు తీసుకొచ్చింది అమెరికానే

Zhao Lijian- Chinese government spokesman
Zhao Lijian- Chinese government spokesman

బీజింగ్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ఈమహమ్మారి పలు దేశాలపై విశ్వరూవిశ్వరూపం ప్రదర్శిస్తోంది ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అమెరికాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నిన్న రాత్రి ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. వూహాన్ కు ఈ మహమ్మారిని తీసుకొచ్చింది అమెరికా ఆర్మీ అని లిజియాన్ ట్వీట్ చేశారు. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాలో కోవిడ్19 వల్ల కొందరు మరణించారని పరీక్షల్లో తేలిందని చెప్పారు. కరోనా కారణంగా అమెరికాలో తొలి మరణం ఎప్పుడు సంభవించిందని ప్రశ్నించారు. ఆ దేశంలో ఎంత మందికి ఈ వైరస్ సోకిందని నిలదీశారు. పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల పేర్లు ఏమిటని ప్రశ్నించారు. లిజియాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కరోనా వైరస్ ను ‘వూహాన్ వైరస్’ అని ఇటీవల సంబోధించారు. దీంతో, చైనీయులు మండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే లిజియాన్ ఈ మేరకు స్పందించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/