ఏపిలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్పు

Madhyāhna bhōjanaṁ
Madhyāhna bhōjanaṁ

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మధ్యాహ్న భోజన పథకం పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపిలో ఎన్టీఆర్‌ ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా మార్చిన కొత్త ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ” వైఎస్సార్‌ అక్షయపాత్రగా” మార్చింది. అంతేకాక మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే భోజనంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆయన అధికారులకు సూచించారు. పరిశుభ్రత పాటిస్తూ ఆహారం సకాలంలో తాజాగా పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యావ్యవస్థ చక్కగా నడిచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, దీనికి పెద్దపీట వేయాలని సిఎం జగన్‌ స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/