మధ్యాహ్న భోజనం వంట ఖర్చు ధర పెంపు

హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వంట ఖర్చు ధర పెంచింది. ఒక్కో విద్యార్థికి ఉన్నత పాఠశాలల్లో వంట ఖర్చు రూ.6.18 నుంచి రూ.6.51కు పెంపు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.6.18 నుంచి రూ. 6.51కుపెంపు, ప్రాథమిక పాఠశాలల్లో రూ. 4.13 నుంచి రూ. 4.35కు పెంపు. గుడ్డు ధర రూ. 2 తో కలిపి ఉన్నత పాఠశాలల్లో రూ.8.51కు పెంచింది. 2018 ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/