24న భారత్‌కు రానున్న మైక్రోసాఫ్ట్ సీఈవో

24 నుంచి 26వ తేదీ మధ్య పర్యటిస్తారన్న మైక్రోసాఫ్ట్

satya-nadella
satya-nadella

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ మధ్య ఆయన పర్యటించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వెల్లడించారు. కాగా ఇండియాలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో సత్య నాదెళ్ల మాట్లాడుతారని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆయన ఏయే నగరాలకు వెళతారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయన ఢిల్లీ, ముంబై, బెంగళూరు సిటీల్లో పర్యటిస్తారని, కొందరు ప్రభుత్వ నేతలు, అధికారులతో సమావేశం అవుతారని మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/