విడాకులకు సిద్ధమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

సిడ్ని: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. మైకెల్ క్లార్క్ తన భార్య కైలీతో త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టుగా బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని క్లార్క్, కైలీ దంపతులు తెలిపారు. 2012లో మాజీ మోడల్, టీవీ ప్రజెంటర్ కైలీతో క్లార్క్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. క్లార్క్, కైలీ దంపతులకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉంది. గత ఏడాది నుంచి కైలీకి దూరంగా ఉంటున్న క్లార్క్..ఇటీవల కూతురు కెల్సే 4వ పుట్టిన రోజు వేడుకల్లో భార్యతో సరదగా గడిపాడు. గత కొంతకాలంగా క్లార్క్్ భార్యతో గొడవపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గతేడాది గొడవలు అధికం కావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/