మైఖేల్‍ బ్లూమ్‍బర్గ్ కీలక నిర్ణయం

బ్లూమ్‍బర్గ్ ఎల్‍పీ సంస్థను అమ్మేస్తాను..

michael-bloomberg
michael-bloomberg

అమెరికా: డెమోక్రటిక్‍ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యాపార దిగ్గజం మైఖేల్‍ బ్లూమ్‍బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తనను ధనవంతుడిని చేసిన బ్లూమ్‍బర్గ్ ఎల్‍పీ సంస్థను అమ్మేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ముఖ్య సలహాదారుడు టిమ్‍ ఓబ్రెయిన్‍ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని విదేశీ వ్యక్తులు, ప్రైవేటు ఈక్వీటీ సంస్థలకు అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు టిమ్‍ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‍లా ఆర్థికపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా వాటికి వీలైనంత దూరంగా ఉండేంఉదకు సంస్థను అమ్మనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. రిపబ్లికన్‍ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో తలపడే డెమోక్రటిక్‍ అభ్యర్థి కోసం జరిగిన ముందస్తు పోల్స్లో మైఖేల్‍ బ్లూమ్‍బర్గ్ అనూహ్యంగా ముందుకొచ్చారు. ఆయన లాస్‍ వేగాస్‍లో తన తొలి డిబేట్‍లో పాల్గొంటారు. నవంబరు 3న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/