అమెరికా అధ్యక్ష బరిలో న్యూయార్క్‌ మాజీ మేయర్‌

Michael Bloomberg
Michael Bloomberg

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో తాను కూడా ఉన్నానని న్యూయార్క్‌ నగర మాజీ మేయర్‌ మైకెల్‌ బ్లూమ్‌బర్గ్‌ ప్రకటించారు. ఆదివారం లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక నిముషం నిడివి వున్న వీడియో ప్రకటనలో తనకు తాను జాబ్స్‌ క్రియేటర్స్‌, లీడర్‌, ప్రోబ్లం సాల్వర్‌ అని భుజకీర్తులు తగిలించుకున్నారు. ఈ వీడియోను ఆయన తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. సంపన్నులపై పన్ను పోటు పెంచి మధ్యతరగతిపై పన్ను భారం తగ్గిస్తానని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించి అమెరికాను పునర్నిర్మించేందుకే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఈ వీడియోలో ప్రకటించారు. అలబామా, అర్కన్సాస్‌ నుండి డెమొక్రాటిక్‌ ప్రైమరీస్‌లో పాల్గొనేందుకు బ్లూంబెర్గ్‌ ఇటీవల దరఖాస్తును అందజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/