నిలిచిన హైటెక్ సిటీ-అమీర్‌పేట్ మెట్రో
స్టేషన్లలో ప్రయాణికుల ఇక్కట్లు

హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ-అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుంచి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్టేషన్లలోనే పడిగాపులుకాస్తున్నారు. హైటెక్ సిటీ-అమీర్‌పేట్ మధ్య మెట్రో సేవలను వినియోగించుకుంటున్న ప్రయాణికులు స్టేషన్లకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న కొందరు ప్రయాణికులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాగా ఈవిషయంపై స్పందించిన మెట్రో అధికారులు సాంకేతిక లోపాల కారణంగానే రైళ్లను నిలిపివేసినట్లు వివరించారు. లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి మెట్రో సేవలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/