త్వరలో అమీర్‌పేట-హైటెక్‌సిటికి మెట్రో

hyderabad metro
hyderabad metro


హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అందరూ కళ్లలో ఒత్తులేసుకుని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అమీర్‌పేట-హైటెక్‌సిటి మెట్రోమార్గం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో మెట్రో నడపడానికి కమీషనర్‌ ఆఫ్‌ మెట్రోరైల్‌ సేఫ్టీ అనుమతినిచ్చింది. ఈ పది కిలోమీటర్ల మార్గంలో సుమారు నాలుగు నెలలుగా ట్రయల్‌ రన్‌ కొనసాగుతుంది. సిఎంఆర్‌ఎస్‌ బృందం ఫిబ్రవరిలో తనిఖీలు చేపట్టింది. ఈ మార్గంలో మెట్రో ప్రారంభం ఐతే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల బాధలు తొలగిపోతాయి. ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గంలో మొత్తం 8 స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌-5, జూబ్లీహిల్స్‌ ,చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌సిటి ఉన్నాయి. హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టులో ఇప్పటికే మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌-అమీర్‌పేట మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అమీర్‌పేట-హైటెక్‌సిటి మార్గంలో కూడా మెట్రో పరుగులు పెట్టనున్నది.