గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మెట్రో రికార్డు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మెట్రో రికార్డు
Metro Record in Greater Hyderabad

Hyderabad: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రికార్డు నెలకొల్పింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సమ్మెతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ప్రయాణీకులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. శనివారం ఒక్కరోజే మొత్తం 3.65 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. గతంలో అత్యధికంగా 3.06 లక్షల మంది ప్రయాణించిన రికార్డును తిరగరాసింది. ఉదయం 5 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించిన మెట్రో… ప్రతి మూడు నిమిషాలకో రైలును నడిపింది. ప్రతీరోజూ నడిపూ రైళ్లకు అదనంగా మరో ఆరు రైళ్లను చేర్చి… అదనంగా వంద ట్రిప్పులను నడిపింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ఆ సంస్థ ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు.

తాజా నిఘా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/