నిమజ్జనం కారణంగా ఆదివారం అర్ద రాత్రి 1గంట వరకు మెట్రో సేవలు

Will ensure people maintain social distance on Delhi Metro

రేపు గణేష్ నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మెట్రో సమయం పొడిగించింది. రేపు అర్ద రాత్రి 1గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. రేపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగనున్న నేపధ్యంలో రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపు జరుగుతున్నందున ప్రయాణికుల ఇబ్బందులు కలుగకుండా మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచనున్నారు. అర్ద రాత్రి 1గంట వరకు మూడు మెట్రో కారిడార్లలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి ట్రైన్ అర్ధరాత్రి 1గంట వరకు మెట్రో స్టేషన్స్ చేరుకుంటాయని మెట్రో ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి తెలిపారు.

ఇక రేపటి నుండి రెండు రోజుల పాటు కొనసాగనున్న గణేష్ నిమజ్జ కార్యక్రమానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే నేటి రాత్రి నుండే ఇతర జిల్లాల నుండి వచ్చే వాహానాలను సైతం నిషేధించారు. ముఖ్యంగా భారీ వాహానాలు గణేష్ శోభా యాత్ర జరిగే రూట్లలోకి ప్రవేశించకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.