బిజెపిలో చేరనున్న‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్

తిరువనంతపురం: మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సురేంద్రన్‌ పిల్లై గురువారం తెలిపారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించే ‘విజయ యాత్ర’ సందర్భంగా ఆయన లాంఛనంగా పార్టీలో చేరుతారని చెప్పారు. విజయ యాత్ర ఈ నెల 21న కాసరగోడ్‌లో ప్రారంభమై.. మార్చి మొదటి వారంలో తిరువనంతపురంలో ముగియనుంది. యాత్రను ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించనున్నారు. దారిపొడవునా పార్టీ నేతలంతా ముందుండి రథయాత్రను నడిపిస్తామని తెలిపారు.


కాగా, శ్రీధరన్… అనగానే మెట్రో రైల్ గుర్తుకొస్తుంది. ఢిల్లీ మెట్రో రైల్‌కు ఆద్యుడిగా విశేష ప్రాచుర్యం పొందారు. ఢిల్లీ ఆనాటి ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ ఈయనను ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఈ ప్రాజెక్టును అనుకున్న షెడ్యూల్ కంటే ముందే పూర్తిచేసి అందరి మన్ననలూ అందుకున్నారు. దీంతో ఆయనకు ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ అన్న పేరు కూడా వచ్చింది. అయితే 2005 లోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ మెట్రో రెండో దశ పూర్తి బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత 2011 న పదవీ విరమణ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/