కరోనా భయంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గింది

ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడయాతో మాట్లాడుతూ..కరోనా భయంతో 10వేల మంది ప్రయాణికులు తగ్గారని తెలిపారు. కరోనా భయంకరమైనది కాదని..ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైల్‌ కోచ్‌లను శుభ్రం చేస్తున్నామన్నారు. సర్వీసులు ముగిసిన తర్వాత ఆటో కెమికల్స్‌తో శుభ్రపరుస్తున్నామన్నారు. ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/