కిరణ్ అబ్బవరం ‘మీటర్’ .. టీజర్ రిలీజ్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ ఆకట్టుకోకగా..మంగళవారం టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు. ఇక ఈ మూవీలో కిరణ్ అబ్బవరం ఎస్సై పాత్రలో నటిస్తున్నట్లుగా టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఎస్సైకి అసిస్టెంట్గా సప్తగిరి కనిపిస్తున్నాడు. ఎస్సైగా ఉంటూనే రౌడీల మక్కిల్ ఇరగదీస్తున్న క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. ఇక ఆయన దగ్గర పనిచేసే మరో పోలీసు అధికారిగా పోసాని కృష్ణ మురళి కనిపించాడు. ఉన్న జాబ్ తీసిపారదొబ్బండి సార్ అంటూ పోసాని కృష్ణ మురళిని కిరణ్ అబ్బవరం కోరుతున్న క్రమంలో… ఇదేంటి అల్లుడు ఇంత ట్రస్ట్ ఇచ్చావ్ అంటూ పీఏగా పనిచేస్తున్న సప్తగిరి ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. అపరిచితుడికి అమ్మ మొగుడిలా తయారయ్యావేంటి అల్లుడు అని సప్తగిరి ప్రశ్నిస్తూ ఉండగా హీరోకి ఉన్న లవ్ యాంగిల్ కూడా చూపించారు. మా మీటర్లో నేను వెళ్తా నన్ను గెలకొద్దు… నాకు అడ్డు రావద్దు అంటూ ఆయన చెబుతున్న డైలాగులు డాన్సులు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఓవరాల్ గా టీజర్ తో సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరుగుతుంది.

ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.

YouTube video