ర‌ష్య‌న్ యాడ్స్‌తో పాటు వార్త‌లూ క‌నిపించ‌వు

ర‌ష్యాపై మెటా సంచ‌ల‌న నిర్ణ‌యం

హైదరాబాద్: ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో ర‌గిలిపోతున్న ర‌ష్యాపై ఇప్ప‌టికే చాలా దేశాలు పలు ఆంక్ష‌లు విధించాయి. అయినా కూడా ర‌ష్యా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలో అమెరికా లాంటి కొన్ని దేశాలు ర‌ష్యాపై మ‌రింత మేర ఆంక్ష‌ల‌ను విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం మెటా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌న ప‌రిధిలోని ఫేస్‌బుక్‌లో ర‌ష్యా వార్త‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లుగా మెటా ప్ర‌క‌టించింది.

మెటా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఫేస్‌బుక్‌లో రష్యన్‌ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లు క‌నిపించ‌వు. అంతేకాదు ఫేస్‌బుక్‌ వేదికగా రష్యన్‌ మీడియాకు ఆదాయం సంపాదించే మార్గాలన్నీ కూడా ముసుకుపోయిన‌ట్టే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మెటా ఆధ్వర్యంలో ప్రస్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై మాత్ర‌మే నిషేధం అమల్లోకి రానుంది. మిగిలిన ప్లాట్‌ఫామ్స్‌ విషయంలో మెటా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మెటా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యన్‌ మీడియా నుంచి వచ్చే సమాచారం ఇకపై ఫేస్‌బుక్‌లో కనిపించదు. అదే విధంగా చాలా వరకు రష్యన్‌ వీడియోలు, ఇతర సమాచారం కూడా ఫిల్టర్‌ అవుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/