మెస్సి ఒప్పందం విలువ రూ.4,911 కోట్లా?

పారితోషికంపై వీడని ఊహాగానాలు!

Messi
Messi

బార్సిలోనా : ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ తీసుకునే పారితోషికంపై ఊహాగానాలు తప్ప ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే అతని బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం ప్రకారం అతని పారితోషికం నాలుగేళ్ల కాలానికి 555 మిలియన్‌ యూరోలు(రూ.4,911 కోట్లు) అని ఒక పత్రిక వెల్లడించింది.

ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించామని, బార్సిలోనాతో మెస్సి ఒప్పంద పత్రం నకలు దొరికిందని ఆ పత్రిక వెల్లడించింది. ఒక్కో సీజన్‌కు బార్సిలోనా మెస్సికి 138 మిలియన్‌ యూరోలకు ఒప్పందం కుదుర్చుకుందని ఆ పత్రిక తెలిపింది. కాగా మెస్సి అందులో సగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా సందర్భంగా బార్సిలోనా జట్టు తమకు కలిగిన నష్టాన్ని వెల్లడించే సందర్భంగా మెస్సితో కుదుర్చుకున్న ఒప్పందం వెల్లడైనట్టు ఆ పత్రిక తెలియజేసింది. ప్రస్తుతం బార్సిలోనా క్లబ్‌ నిర్వహణ తాత్కాలిక కమిటీ పర్యవేక్షణలో సాగుతోంది. దానిపై అవిశ్వాస తీర్మానంకూడా జరిగింది.

క్లబ్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ బార్టిమో గత అక్టోబర్‌లో రాజీనామా చేసినప్పటినుంచి బార్సిలోని కార్యకలాపాలు గతితప్పాయి. అందుకే మెస్సికూడా క్లబ్‌నుంచి విడిపోదామని భావిస్తున్నాడు. ఈ సీజన్‌ అనంతరం మెస్సితో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు క్లబ్‌కూడా అంగీకరించింది. గత రెండు దశాబ్దాలుగా బార్సిలోనా జట్టుతో ప్రయాణం కొనసాగించిన మెస్సి తన ప్రతిభతో వివిధ టోర్నీలలో 30 టైటిల్స్‌ను క్లబ్‌కు అందించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/