ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు

మహిళా స్వయం సాధికారితపై ప్రభుత్వం దృష్టి -ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: మహిళా స్వయం సాధికారితపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

దీనిలో భాగంగా ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌తో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే మార్పులు సాధ్యంకావు. మహిళల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నాం అని అన్నారు..

ఆగస్టులో 12న ‘వైఎస్సార్‌ చేయూత’ ప్రారంభిస్తున్నామని అన్నారు .

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూత , పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం’ అని అన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/