సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా

ఇద్దరూ విడిపోనున్నారంటూ వెల్లువెత్తుతున్న వార్తలు

సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా
melania-trump-walks-with-soldier

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెలానియా, ట్రంప్ విడాకులు తీసుకోనుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. వెటరన్స్ డే సందర్భంగా తన భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికను సందర్శించారు. ఈ సందర్భంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. మెలానియా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. తన భర్తతో కలిసి నడవకుండా.. ఓ సైనికుడి చేయి పట్టుకుని మెలానియా నడిచింది. ఈ ఘటనతో అక్కడి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన తర్వాత వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తకు మరింత బలం వచ్చింది. జనవరిలో ట్రంప్ అధ్యక్షపీఠం నుంచి వైదొలగగానే వీరి వివాహబంధం ముగుస్తుందని చెపుతున్నారు. ఒకవేళ ట్రంప్‌ను మెలానియా వదిలేస్తే ఆమెకు భరణం రూపంలో భారీ మొత్తం అందనుందట. మొదటి ఇద్దరు భార్యలకు ఇచ్చిన దాని కంటే కూడా మెలానియాకు ట్రంప్ భారీ మొత్తం ఇవ్వాల్సి ఉంటుందట. దీని విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/