నేను బతికే ఉన్నా… డెత్‌ రూమర్లను ఖండించిన క్రికెటర్‌

MEKKALLA
MEKKALLA

నేను బతికే ఉన్నా… డెత్‌ రూమర్లను ఖండించిన క్రికెటర్‌

వెల్లింగ్టన్‌ : తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలపై న్యూజిలాండ మీజీ ఆల్‌రౌండర్‌ నాథన్‌ మెకల్లమ్‌ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని, తాను భేషుగ్గా ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మెకల్లమ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల అయ్యాయి. దీంతో స్పందించిన మెకల్లమ్‌ ఓ సెల్పీ తీసుకుని దానిని పోస్టు చేస్తూ.. నేను చాలా బాగాన్నా, మునుపటి కంటే ఆరోగ్యంగా ఉన్నా, నేను చనిపోయినట్టు ఎవరు సృష్టించారో కానీ అందులో వాస్తవం లేదు. లవ్‌యూ ఆల అని ట్వీట్‌ చేశాడు. మెకల్లమ్‌ చనిపోయినట్టు వార్తలు వైరల్‌ కావడంతో క్రికెట అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వాస్తవం తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో విపరీతంగా సెర్చ్‌ చేశారు. ఇప్పుడు స్వయంగా మెకల్లమే ట్విట్టర్‌ ద్వారా తాను బతికే ఉన్నట్టు స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ======