నాకు ట్రిపుల్‌ సెలబ్రేషన్సే: మెహరీన్‌

MEHRINE

నందమూరి కల్యాణ్‌రామ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘ఎంతమంచివాడవురా.. జాతీయ పురస్కార గ్రహీత సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.. ఆడియో రంగంలో అగ్రగామి సంస్థ ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రై.లి. పతాకంపై ఉమేష్‌గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్నారు.. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.. సంక్రాంతి సందర్భంగా ఈచిత్రం ఈనెల 15న విడుదల కాబోతోంది. ఈసందర్భంగా హీరోయిన్‌ మెహరీన్‌ మీడియాతో మాట్లాడారు..

ఈ జనవరి నెల నాకు త్రిపుల్‌ సెలబ్రేషన్సే.. ఎందుకంటే సంక్రాంతికి తెలుగులో ఎంత మంచివాడవురాతో తెలుగు ప్రేక్షకులకు , పటాస్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరిస్తున్నాను.. అలాగే ఈనెల 31న అశ్వద్ధామ విడుదల కాబోతోంది.. ఎంతమంచివాడవురా చిత్రానికి వస్తే.. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. సినిమాలో నాపాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంది.. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటుంది.. ఇందులో నాపాత్ర షార్ట్‌ఫిలింస్‌ ప్రొడ్యూసర్‌ని.. కల్యాణ్‌రామ్‌గారు నా షార్ట్‌ఫిల్మ్స్‌లో హీరోగా చేస్తుంటారు.. ఇద్దరం చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటారు.. ఈసినిమాలో మంచి యాక్షన్‌, లవ్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి.. పండుగ సినిమా ఇది.. నేను ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనే సరదాగా ఉంటా.. దాంతో దర్శకుడు సతీష్‌గారు నన్ను కాంటాక్ట్‌చేశారు. ఎఫ్‌2 తర్వాత ఐదారు నెలలు ఖాళీగా ఉన్నా.. తర్వాతనే నాకు ఈసినిమాలో అవకాశం వచ్చింది.. సినిమా అనేది బలమైన మాధ్యమం.. కేవలం సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే కాదు.. సినిమాలో మనం ఏదైనా మంచి విషయాన్ని చెప్పాలి.. ఎమోషనల్‌ సీన్స్‌ చేయటం నా బలం.. సాధారణంగా అలాంటి సీన్స్‌లో గ్లిజరిన్‌ వాడతారు.. నేను గ్లిజరిన్‌ వాడను. ఎమోషనల్‌గా పాత్రకు కనెక్ట్‌ అయ్యి నటించటానికి ప్రయత్నిస్తా.. జయాపజయాలు మనచేతుల్లో ఉండవు.. సినిమా కథలను ఎంచుకునేటపుడు మంచి కథలు ఉండేలా చూసుకోవాలి.. ఆపాత్రలకు న్యాయం చేయాలి.. అందరూ మంచి సినిమాలు చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్‌ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్నా.. బాలీవుడ్‌ గురించి ఆలోచించటం లేదు.. అయితే నా తమ్ముడు మాత్రం బాలీవుడ్‌లో యాక్టర్‌గా కరణ్‌జోహార్‌గారి ద్వారా పరిచయం కాబోతున్నాడు.. తెలుగు చిత్రసీమ అంటే నాకు అమ్మతో సమానం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/