మళ్లీ గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్: గత ఏడాది 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధం చేసి ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఆమెను గృహనిర్బంధం చేశారు. రెండు రోజుల నుంచి తనను హౌజ్ అరెస్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. పుల్వామాలో పార్టీ నేత వహీద్ పారా కుటుంబాన్ని సందర్శించడానికి తనకు అనుమతి ఇవ్వలేదని ఆమె అన్నారు. తన కూతుర్ని కూడా గృహ నిర్బంధం చేసినట్లు ముఫ్తీ పేర్కొన్నారు. పీడీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ పారాను రెండు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా నుంచి డీడీసీ ఎన్నికల్లో పారా నామినేషన్ వేశారు. వహీద్ పారాను నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ముఫ్తీ ఆరోపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/